Header Banner

అర్హులు అందరికీ గృహాల మంజూరుకు చర్యలు.. రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయి.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు!

  Thu Feb 13, 2025 12:08        Politics

గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గృహ నిర్మాణ నిధులు దాదాపు రూ.3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు ఎంతగానో అన్యాయం చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆయన తప్పు పట్టారు. నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమైన గత ప్రభుత్వం తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు గృహ నిర్మాణాలపై  కేంద్రం రూ.20,726 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే, ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవడమే కాకుండా ఇళ్లను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల  దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 2018 లో ఆవాస్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి పీఎం గ్రామీణ్ - 1.0 క్రింద 3,18,987 మంది లబ్దిదారులను గుర్తించి కేంద్ర వెబ్ సెట్ లో ఫీడ్ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని అంతా వక్రీకరిస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రవర్తించడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. 

ఇది కూడా చదవండి: నేడు (13/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


అర్హులు అందరికీ శాశ్వత గృహ వసతి.. వచ్చే ఐదేళ్లలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే దృడనిశ్చయంతో తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. పీఎం గ్రామీణ్- 1.0 పథకం వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తి కావాల్సి ఉందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఆ పథకాన్ని 2025 డిశంబరు వరకూ పొడిగించడం జరిగిందన్నారు. ఈ పథకం క్రింద తమ ప్రభుత్వం 1.15 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 7.35 లక్షల గృహాల్లో  1.50 లక్షల గృహాలను ఈ జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా పీఎం గ్రామీణ్ - 2.0 పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం ఉందన్నారు. ఈ పథకం క్రింద లబ్దిదారులను గుర్తించే సర్వే ఇప్పటికే మొదలైందని, ఇప్పటి వరకూ 11,600 లబ్దిదారులను గుర్తించడం జరిగిందన్నారు. ఈ పథకం క్రింద కేంద్రం నుండి దాదాపు 5 లక్షల గృహాలను మంజూరు చేయించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ పథకం క్రింద  50 వేల గృహాలను మంజూరు చేయడం జరిగిందని,  ఈ మార్చి నెలాఖరు నాటికి మరో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయించుకోవాలనే లక్ష్యంతో లబ్దిదారులు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్‌ క‌ల‌క‌లం! ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి?

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. జిల్లాల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. రేటు తగ్గినా, గుడ్లు ఫ్రీ అన్న తినకండి!

 

మెగా డీఎస్సీపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌! ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

 

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గుడ్​న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!

 

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..

 

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KolusuPardhaSaradhi #YSJagan #APPolitics